అమరావతికి సింగపూర్ బైబై!
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఆర్థికాభ్యున్నతికి ప్రధాన చోదకశక్తిగా నిలుస్తుందని భావించిన స్టార్టప్ ఏరియా (సీడ్ క్యాపిటల్) ప్రాజెక్ట్ నుంచి సింగపూర్ ప్రభుత్వం తప్పుకోవాలని నిర్ణయింకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర సర్కారుకు కూడా తెలిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ ప్రాజెక్టు నుంచి తాము స్వచ్ఛందంగా తప్పుకుంటామని సింగపూర్ పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు తర్వాత అమరావతిపై అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. అవినీతి జరిగిందని, ముంపు ప్రమాదం ఉందని, ఇన్సైడర్ ట్రేడింగ్ చోటు చేసుకుందని మంత్రులు వరుసగా ఆరోపణలు చేస్తున్నారు. అదే సమయంలో రాజధానిని తరలిస్తామని మేం చెప్పలేదు అని పేర్కొంటున్నారు. మొత్తానికి కొత్తగా ఎలాంటి అభివృద్ధి చేయకుండా, ప్రతిష్ఠాత్మక నిర్మాణాలు చేపట్టకుండా నామ్కే వాస్తే గా మాత్రమే అమరావతి ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీడ్ క్యాపిటల్ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని సింగపూర్ కన్సారియం నిర్ణయించుకున్నట్లు సమాచారం.













