Tirumala: తిరుమల శ్రీవారికి ఘనంగా సింహ వాహన సేవ

తిరుమల (Tirumala) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి సింహ వాహన సేవ నిర్వహించారు. మలయప్ప స్వామి (Malayappa Swamy) వారు సింహ వాహనాన్ని అధిరోహించి యోగముద్ర అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మాడ (Mada) వీధుల్లో వివిధ కళాబృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి వాహన (Vehicle) సేవలో పాల్గొని కర్పూర హారతులు సమర్పించారు.