త్వరలో ఈ సమస్య పరిష్కారం : వైఎస్ జగన్
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఇసుక సమస్య తాత్కాలికమేనని త్వరలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 265 పైగా ఇసుక రీచ్‌లలో ప్రస్తుతం 61 మాత్రమే పనిచేస్తున్నాయని అన్నారు. మిగిలిన ఇసుక రీచ్లన్నీవరద నీటిలోనే ఉన్నాయని అన్నారు. రహదారులు, భవనాల శాఖలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ మూడు నెలలుగా కృష్ణా, గోదావరి, పెన్నానదులు పొంగిపొర్లుతున్నాయి. నిరంతర వరదల వల్ల ఇసుక సమస్య వస్తోందన్నారు. ఈ నెలాఖరుకు ఇసుక రీచ్ సమస్య పూర్తిగా తీరుందది.
ఐదేళ్లలో ఇసుక మాఫియా నడించింది. ప్రజలకు మేలు చేసేలా ఇసుక పాలసీ తీసుకు వచ్చామని అన్నారు. గత ఐదేళ్లలో పేరుకే ఇసుక ఫ్రీ అన్నారు. మాఫియా కొనసాగించారని అన్నారు. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు మాన్యువల్‌గా చేస్తున్నామని తెలిపారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఇసుక పాలసీని తెస్తామనారు. కి.మీ.కు 4.90 రూపాయలకు ఎవరైతే రవాణా చేస్తారో వారిని రమ్మన్నాం. వరద తగ్గగానే ఇసుక సరఫరా పెరుగుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రాధాన్య రంగాలకు ఇసుక ఇవ్వడానికి ప్రత్యేక స్టాక్‌యార్డులు ఏర్పాటు చేస్తామని సృష్టం చేశారు.













