ఎమ్మెల్యేలకు జగన్ షాక్ తప్పదా…?
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు సమర్ధవంతంగా పని చేయడం లేదు అని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. కొన్ని కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎక్కువగా దృష్టి పెట్టినా సరే కొంతమంది సమర్థవంతంగా పని చేయకపోవడంతో నష్టం ఎక్కువగా జరుగుతుందనే భావన చాలా మందిలో వ్యక్తమవుతున్నది. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా ఎమ్మెల్యేలను ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశాలు ఉండవచ్చు.
ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక అయిన తర్వాత చంద్రబాబునాయుడు ప్రతి నియోజక వర్గం మీద సమీక్ష నిర్వహించి అక్కడ పోరాటాలు చేసే విధంగా నాయకులకు దిశానిర్దేశం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా సీరియస్ గా ముందుకు వెళ్లలేకపోతే మాత్రం పరిస్థితులు ఆందోళన కలిగించే విధంగా ఉండవచ్చు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతుంది. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొంతమంది విషయంలో పెద్దగా పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు రావడం లేదు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది.
అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి చర్యలు దిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఏవిధంగా అనేది ఒకసారి చూస్తే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉండకపోవడంతో స్థానిక నాయకులు కార్యకర్తలు కూడా ఇబ్బంది పడుతున్నారు. దీంతో నియోజకవర్గాల మీద జగన్ ఇప్పటికే పూర్తి స్థాయిలో సమాచారాన్ని తెప్పించుకొని సిద్దంగా ఉంచారని సమాచారం తిరుపతి ఉప ఎన్నిక అయిన వెంటనే జగన్ నియోజకవర్గాలకు సంబంధించి కొత్త ఇన్చార్జి లను ప్రకటించే అవకాశం ఉంది.
వచ్చే ఎన్నికల్లో మీరు ఇక్కడినుంచే పోటీ చేస్తారని కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని విపక్ష విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగట్టాలని ఆయన స్పష్టంగా సూచనలు సలహాలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా ఎంపీల విషయంలో కూడా జగన్ చాలా వరకు ఇప్పుడు సీరియస్ గానే ఉన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా ఎంపీలు చేయకపోవడం పట్ల జగన్ లో అసహనం పెరిగిపోతోంది. అందుకే ఇప్పుడు ఎమ్మెల్యేల విషయంలో అలాగే ఎంపీల విషయంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకుని వాళ్లను పక్కన పెట్టడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.
తొలి దశలో భాగంగా 20 నియోజకవర్గాలకు సంబంధించి జగన్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉండవచ్చని మంత్రుల నియోజకవర్గాల మీద కూడా దృష్టి పెట్టొచ్చు అని అంటున్నారు.













