టీడీపీకీ శిల్పా మోహన్‌రెడ్డి గుడ్‌బై
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఈ నెల 14న వైకాపాలో చేరనున్నట్లు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నంద్యాల నియోజకవర్గ బాధ్యుడు శిల్పా మోహన్‌రెడ్డి తెలిపారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నంద్యాలలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో తనతోపాటు తన వర్గీయులకు సముచిత స్థానం లేదన్నారు. స్థానికంగా మంత్రి అఖిలప్రియ, మాజీ మంత్రి ఫరూక్, ఎంపీ వైస్పీవై రెడ్డిలు మూకుమ్మడిగా తనను వ్యతిరేకించడం బాధాకరమన్నారు. స్వపక్షంలో విపక్షంగా కొనసాగడం ఇబ్బందికరంగా ఉందని అన్నారు. నంద్యాల విషయంలో అధిష్టానం మౌనం వహించడంతో పార్టీని వీడే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.













