టీడీపీకి శిల్పా గుడ్‌బై
కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. నంద్యాలలో చక్రపాణి రెడ్డి, తన సోదరుడు శిల్పా మోహన్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. టీడీపీలో తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని చక్రపాణి ఆరోపించారు. ఇటీవల నంద్యాలకు ముఖ్యమంత్రి వస్తే కనీసం తనకు ఆహ్వానం లేదని, టీడీపీ తనను తీవ్రంగా అవమానించిందని అన్నారు. వచ్చె అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీశైలం టికెట్ అడిగితే హామీ ఇవ్వకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీ రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజీనామా పత్రాన్ని టీడీపీ కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపినట్లు తెలిపారు.













