Shankar: గేమ్ ఛేంజర్ కోసం శంకర్ కష్టాలు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా శంకర్(Shankar) దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్(game changer) సినిమా రిలీజ్ కు మరో 20 రోజులు మాత్రమే ఉంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా గురించి ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. సంక్రాంతి పోటీలో వస్తున్న సినిమాల్లో మొదటి సినిమా కావడంతో ఓపెనింగ్స్ విషయంలో రికార్డులు సృష్టించడం ఖాయమని అందరూ ఫిక్సైపోయారు.
అయితే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో శంకర్ చాలా హోమ్ వర్క్ చేసినట్లు తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ స్క్రిప్ట్ విభాగంగా ఎస్ వెంకటేశన్(S Venkateshan) అనే వ్యక్తి కీలక పాత్ర పోషించాడట. ఆయన మరెవరో కాదు తమిళనాడు మధురై నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ. చరణ్ చేసిన ఐఏఎస్ రామ్ నందన్(IAS Ram Nandan) పాత్రను డిజైన్ చేయడంలో వెంకటేశన్ పాత్ర చాలా ఉందని తెలుస్తోంది.
పొలిటీషియన్ గానే కాకుండా రైటర్ గా కూడా వెంకటేశన్ కు చాలా పెద్ద పేరుంది. వీర యుగ నాయగన్(Veera Yuga Nayagan) అనే సుప్రసిద్ధ నవల వెంకటేశన్ కలం నుంచి వచ్చిందే. శంకర్ ఆ బుక్ రైట్స్ కొని ఫ్యూచర్ లో మూడు భాగాల పాన్ ఇండియా సినిమాగా తీసే ఆలోచనలో ఉన్నాడు. అప్పట్నుంచే వీరిద్దరి మధ్య బంధం బలపడింది. ఆయన రెగ్యులర్ గా గేమ్ ఛేంజర్ సెట్స్ కు వచ్చి తగిన సూచనలు, సలహాలు ఇస్తూ ఉండేవాడట. అంతేకాదు చరణ్ డైలాగ్ డిక్షన్, కలెక్టర్లు వ్యవహరించే తీరు మీద కూడా ఆయనే ట్రైనింగ్ ఇచ్చాడని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. మొత్తానికి ఈ సినిమా కోసం శంకర్ బాగా కష్టపడినట్లు తెలుస్తోంది.













