టీడీపీలోకి ఎంపీ బుట్టా రేణుక?
కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టారేణుక తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. గత కొంతకాలం నుంచి బుట్టారేణుక పార్టీ మారుతారని బలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌తో ఆమె రహస్యంగా మంతనాలు జరిపినట్లు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. కర్నూలు ఎంపీ టికెట్ తిరిగి బుట్టా రేణుకకే ఇచ్చే విధంగా ఒప్పందం కూడా కుదిరినట్లు సమాచారం. శనివారం ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తుది విడతగా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన అనంతరం ఆమె తెలుగుదేశం పార్టీ లో చేరేందుకు సన్నాహాలు చేసుకోనున్నారు.













