ముస్లింల సంక్షేమానికి పెద్దపీట : చంద్రబాబు
ముస్లింల సంక్షేమం, అభివృద్ధి, భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రంజాన్ సందర్భంగా రాష్ట్ర మైనారిటీ ఆర్థిక సంస్థ చైర్మన్ ఎండీ హిదాయత్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా ఆధ్వర్యంలో పలువురు ముస్లిం పెద్దలు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లి చంద్రబాబును కలిశారు. ముఖ్యమంత్రిని కలిసినవారిలో మైనారిటీ ఆర్థిక సంస్థ డైరెక్టర్లు మొయినుద్దీన్, సయ్యద్ కిర్మణి, కఫీల్ బాష తదితరులున్నారు.













