ఎట్టకేలకు ఏపీకి ఐఏఎస్ శ్రీలక్ష్మి ….
సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి సుదీర్ఘ ప్రయత్నాలు ఫలించాయి. ఏపీలో వైసీసీ సర్కార్ ఏర్పడిన తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలన్న ఆమె ప్రయత్నాలు ఎట్టకేలకు సఫలీకృతం అయ్యాయి. డిప్యుటేషన్ కుదరదని సృష్టం చేసినప్పటికీ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించి ఆమె.. ఇప్పుడు ఏకంగా కేడర్‌నే ఆంధ్రప్రదేశ్‌కు మార్చుకోవడం విశేషం. ఇక, క్యాట్ ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం శ్రీలక్ష్మిని రిలీవ్ చేయడం.. ఆమె అమరావతిలోని సచివాలయంలో జీఏడీలో రిపోర్టు చేయడం కూడా జరిగిపోయాయి.
కాగా, వైఎస్ జగన్ ఏపీ సీఎం అయిన వెంటనే తెలంగాణ కేడర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు డిప్యుటేషన్‌పై పంపించాలని దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ సీఎం కూడా ఆమె తరపున ఢిల్లీలో పైరవీలు చేశారని చెబుతుంటారు. మొత్తానికి ఏపీకి వెళ్లే విషయంలో కేంద్రం ఆమోదానికి చాలా కాలం నుంచి వేచి చూసిన శ్రీలక్ష్మికి ఊరట లభించిందనే చెప్పాలి.













