AP Bhavan: ఏపీభవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్ కుమార్ బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్(ఆర్సీ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్(Praveen Kumar) బాధ్యతలు స్వీకరించారు. 2006 బ్యాచ్‌కు చెందిన ఆయన సోమవారం ఏపీభవన్‌లో మాజీ ఆర్సీ సౌరభ్‌గౌర్ (RC Saurabh Gaur)నుంచి చార్జ్ తీసుకున్నారు. గతంలో ప్రవీణ్ కుమార్ విశాఖపట్నం, పశ్చిమగోదావరి, ప్రకాశం, తిరుపతి జిల్లాల కలెక్టర్‌గా, జీవీఎంసీ కమిషనర్‌గా పనిచేశారు. స్వరాష్ట్రం బిహార్(Bihar) .ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ను సౌరభ్‌గౌర్‌తోపాటు స్పెషల్ కమిషనర్ అర్జా శ్రీకాంత్, డిప్యూటీ కమిషనర్ ఎన్వీ రామారావు, కదిరి మోహన ప్రభాకర్ అభినందించారు.