బుద్దాకి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆఫర్
అసెంబ్లీ లాబీలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. శాసనసభ లాబీలో తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, బీజేపీ నేత సోము వీర్రాజు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా బీజేపీలో చేరాలని బుద్దా వెంకన్నను వీర్రాజు ఆహ్వానించారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రిని చేస్తామన్నారు. బీజేపీలో ఎలాంటి గ్రూపులు లేవని సృష్టం చేశారు. దీంతో బుద్దా వెంకన్న సోము వీర్రాజుకు రివర్స్ ఆఫర్ ఇచ్చారు. మీరే మాతో కలిసి పనిచేయండి. టీడీపీ ప్రభుత్వం వచ్చాక కేబినెట్లోకి తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కొద్దిసేపు పిచ్చాపాటిగా మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.













