Rayalaseema :రాయలసీమకు మరో భారీ పెట్టుబడి… రూ.468 కోట్లతో
సెమీకండక్టర్ యూనిట్ల హబ్‌గా రాయలసీమ (Rayalaseema) మారనుంది. ఈ రంగానికి సంబంధించి మరో భారీ ప్రాజెక్టు తిరుపతి (Tirupati) జిల్లాలో ఏర్పాటు కానుంది. దక్షిణ కొరియా (South Korea )కు చెందిన అడ్వాన్స్డ్ సిస్టం ఇన్ ప్యాకేజీ (ఏఎస్ఐపీ) టెక్నాలజీస్ అపాక్ట్ సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. దీనిద్వారా రూ.468 కోట్ల పెట్టుబడులను సంస్థ పెట్టనుంది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలోనే మొదటి ప్రైవేట్ సెమీకండక్టర్ యూనిట్ కర్నూలు జిల్లా (Kurnool District) ఓర్వకల్లులో ఏర్పాటుకు ఇండిచిప్ సెమీకండక్టర్స్ లిమిటెడ్, జపాన్ (Japan) కు చెందిన ఇవోటా మైక్రో టెక్నాలజీ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ఏడాది జనవరిలో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ద్వారా రూ.14 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ అంగీకరించింది.







