ఎల్జీ పాలిమార్స్ సీజ్
స్టైరిన్ లీకేజీ దుర్ఘటన జరిగిన విశా•లోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ మూతపడింది. ఈ ఘటనను సుమోటోగా విచారిస్తున్న హైకోర్టు పరిశ్రమ ప్రాంగణాన్ని పూర్తిగా మూసివేయాలని (సీజ్ చేయాలని )ఆదేశించింది. కోర్గు ఆదేశాల మేరకు పరిశ్రమ ప్రాంగణాన్ని మూసివేసినట్లు విశాఖపట్నం పోలీసులు ప్రకటించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం ఈ నెల 22న ఇచ్చిన మధ్యంత ఉత్వరుల తీర్పు ప్రతి అందబాటులోకి వచ్చింది. కంపెనీ డైరెక్టర్లు సహా ఎవరీ అందులోకి వెళ్లడానికి అనుమతించొద్దని తేల్చి చెప్పింది.













