YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరికి భద్రత పెంపు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Viveka Murder Case) హత్య కేసులో ప్రధాన అప్రూవర్‌గా ఉన్న దస్తగిరికి భద్రతను గణనీయంగా పెంచాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం దస్తగిరికి 1+1 గన్మెన్లతో భద్రత ఉండగా.. దాన్ని ఇప్పుడు 2+2 గన్మెన్ల స్థాయికి పెంచాలని నిర్ణయించినట్లు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) సాక్షులు అనుమానాస్పదంగా మరణిస్తున్న నేపథ్యంలో తనకు అదనపు భద్రత అవసరమని జిల్లా ఎస్పీకి దస్తగిరి వినతిపత్రం అందజేశారు. దస్తగిరి వినతిని పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు, అతని భద్రతను పెంచాలని నిర్ణయించారు. దీంతో గురువారం సాయంత్రం నుండి ఇద్దరు అదనపు గన్మెన్లు దస్తగిరి ఇంటి వద్ద విధుల్లో చేరారు. ఇప్పుడు మొత్తం నలుగురు గన్మెన్లు దస్తగిరికి భద్రతను అందిస్తున్నారు.













