ఫిర్యాదులపై ఎన్నికల సంఘం సృష్టత
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సృష్టత ఇచ్చింది. ఈ తరహా ఫిర్యాదులు స్వీకరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారుల (ఆర్వో)కు ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ల ఉపసంహరణ కోసం నిర్దేశించిన మార్చి 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు దీనిపై వివరాలు పంపాలని సూచించింది. అసహజ రీతిలో నామినేషన్ల ఉపసంహరణ జరిగి ఉంటే అలాంటి పరిస్థితులపై ఫిర్యాదులు స్వీకరించి వాటిని ఎస్ఈసీకి నివేదించాలని ఆర్వోలను ఆదేశించింది. ఎక్కడైనా బలవంతపు ఉపసంహరణలు జరిగితే వాటిపై పున పరిశీలించి పునరుద్ధరిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం సృష్టం చేసింది.













