మళ్లీ హైకోర్టుని ఆశ్రయించిన ఏపీ ఎస్ఇసి
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా ఇటీవలే పదవీ బాధ్యతలు స్వీకరించిన రమేష్‌కుమార్ మరోసారి హైకోర్టు తలుపు తట్టారు. ప్రభుత్వం జీవో ద్వారా పదవి నుంచి తొలగించిన అనంతరం…హైకోర్టు ఆదేశానుసారమే ఆయన పునర్నియామకం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రమేష్ కుమార్ మరోసారి హైకోర్టును ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం తనపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని రమేష్‌కుమార్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ కు చెందిన సిబ్బందిపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని. తద్వారా తమను వేధిస్తోందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది.













