పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి
పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని ఆంధప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆధికారులకు దిశానిర్దేశం చేశారు. కడప జిల్లాలో పర్యటించిన ఆయన ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై జిల్లా అధికారులతో కడప కటెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణపై తీసుకున్న చర్యలను కలెక్టర్ హరికిరణ్ ఎస్ఈసీకి వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల ఏర్పాట్లు తదితరాలను చెప్పారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్ఈసీ మాట్లాడారు. అసాధారణంగా నిర్వహించే ఏకగ్రీవాల పక్రియ మంచిది కాదన్నారు. ఎన్నికలు సకాలంలో జరగాలని తెలిపారు. ఏకగ్రీవాలపై షాడో బృందాలు దృష్టి పెడతాయన్నారు. అందరికీ సమాన న్యాయం కల్పించాలన్నదే లక్ష్యం అని ఎస్ఈసీ వివరించారు. ఏకగ్రీవాలన్నీ తప్పని చెప్పట్లేదని, అసాధారణంగా జరిగితేనే పరిశీలిస్తామన్నారు.













