పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లు తీసుకెళ్లొచు..కానీ
పోలింగ్ బూత్‌లలోకి ఓటర్లు సెల్ఫోన్లు తీసుకెళ్లవచ్చని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని వచ్చే ఓటర్ల వద్ద సెల్ఫోన్లు ఉన్నా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయవద్దని అధికారులను ఆదేశించారు. అయితే, ఓటర్లు పోలింగ్ కేంద్రాలలో సెల్ఫోన్లు వినియోగించరాదని, అటువంటి ఘటనలు జరిగితే ఫోన్లు సీజ్ చేయవచ్చని భద్రతా సిబ్బందికి ఎస్ఈసీ సృష్టం చేశారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పలు పోలింగ్ కేంద్రాలలోకి ఓటర్లు సెల్ఫోన్లు తీసుకెళ్తున్నారని పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెల్ఫోన్లు తెచ్చుకోవద్దని తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, ఇప్పుడు అడ్డుకుంటే ఎలాగని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై విధంగా ఆదేశాలు జారీ చేశారు.













