మంత్రి కొడాలి నానికి ఎస్ఈసీ షాక్
ఎన్నికల కమిషనర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు కృష్ణా జిల్లా ఎస్పీకి ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందున ఐపీసీ సెక్షన్లు 504, 505, 506 కింద కేసులు నమోదు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ నెల 21న పంచాయతీ ఎన్నికల తుది విడత పోలింగ్ ముగిసే వరకు మీడియాతో మాట్లాడవద్దని మంత్రి కొడాలి నానిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఆదేశించారు. అప్పటి వరకు మంత్రి సమావేశాల్లోగానీ, బృందాలతో గానీ మాట్లాడరాదని సృష్టం చేశారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయన్నారు. కృష్ణా జిల్లా కలెక్టరు, ఎస్పీ, విజయవాడ పోలీసు కమిషనర్ ఈ ఆదేశాలు అమలయ్యేలా చూడాలని ఆయన ఆదేశించారు.













