తిరుపతిలో 500 కోట్లతో సైన్స్ సిటీ
తిరుపతిలో రూ.500 కోట్లతో సైన్స్ సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలను కేంద్రానికి పంపామని, త్వరలో ఏర్పాటు చేస్తామని మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో రెండు రోజులపాటు జరిగే 26వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సైన్స్ ఎక్స్పో-2018ను ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి ప్రసంగిస్తూ రాజమహేంద్రవరం, ఒంగోలు, కర్నూలు ప్రాంతాల్లో రూ.25 కోట్ల చొప్పున, విశాఖలో రూ.26 కోట్లతో సైన్స్ మ్యూజియంలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలోని సైన్స్ మ్యూజియంను అభివృద్ధి చేస్తామన్నారు.













