వైకాపా ఎమ్మెల్యేకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆయా కార్యాలయాల నిర్మాణాలకు జరుగుతున్న భూ సేకరణపై స్టే ఇవ్వాల్సిందిగా ఆయన సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. అయితే భూ సేకరణపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇదే విషయంపై ప్రస్తుతం హైకోర్టులో కేసు విచారణలో ఉండగా అదే పిటిషన్ను తాము విచారణకు స్వీకరించబోమని సుప్రీంకోర్టు సృష్టం చేసింది. దీంతో ఆయనకు చుక్కెదురైనట్లైంది. హైకోర్టులో విచారణ పూర్తయ్యాక తమ వద్దకు రావాలని సూచించింది.













