తెలుగు రాష్ట్రాలకు నలుగురు న్యాయమూర్తులు
తెలుగు రాష్ట్రాలకు నలుగురు న్యాయమూర్తులను నియమించాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఆంధప్రదేశ్‌కు ముగ్గురు, తెలంగాణకు ఒకరిని కేటాయించింది. న్యాయవాదులు బొప్పుడి కృష్ణమోహన్, కె.సురేష్‌రెడ్డి, కె.లలిత కుమారి అలియాస్ లలితలను ఆంధప్రదేశ్ హైకోర్టుకు, తెలంగాణ హైకోర్టుకు న్యాయవాది బి.విజయసేన్‌రెడ్డిని న్యాయమూర్తులుగా నియమించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్‌కుమార్ మిశ్ర, జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్, జస్టిస్ ఆర్.భానుమతిలతో కూడిన కొలీజియం సోమవారం సిఫార్సు చేసింది.













