ఘనంగా సత్యసాయి జయంతి వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సత్యసాయి 98వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ట్రస్టు 2022-23 వార్షిక నివేదికను మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్, సభ్యులు నాగానంద, డాక్టర్ మోహన్, దేశీయ సాయి సంస్థల అధ్యక్షుడు నిమీష్ పాండే విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 300 నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా లక్షల మంది నిరుద్యోగ యువతకు శిక్షణ అందించి, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడిరచారు. కోటి మొక్కుల పెంపకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. వేడుకల్లో భాగంగా స్వర్ణరథం పై సత్యసాయి చిత్రపటాన్ని ఊరేగించారు.













