ఈ నెల 18 నుంచి సత్యసాయి జయంతి వేడుకలు
ఈ నెల 18 నుంచి పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయిబాబా జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు సత్యసాయి ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 18న ఉదయం సాయికుల్వంత్ మందిరంలో సాయి సత్యనారాయణస్వామి వ్రతం, వేణుగోపాలస్వామి రథోత్సవంతో వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హాజరుకానున్నట్లు తెలిపారు. 19వ తేదీన మహిళా దినోత్సవం 20, 21వ ఆధ్యాత్మిక సదస్సులు ఉంటాయన్నారు. 22న నిర్వహించనున్న సత్యసాయి విశ్వవిద్యాలయం 40వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా జస్టిస్ ఎన్వీ రమణ హాజరై 30 మంది విద్యార్థులకు బంగారు పతకాలను అందజేస్తారని తెలిపారు. 23న సాయికుల్వంత్ మందిరంలో నిర్వహించే 96వ జయంతి వేడుకల్లోనూ జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొంటారని తెలిపారు.













