అంగరంగ వైభవంగా సత్యసాయి జయంతి వేడుకలు
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి బాబా జయంతి వేడుకలు శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సత్యసాయి ట్రస్టు ఆధ్వర్యంలో రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పట్టణ వీధులలో రథోత్సవం సాగింది. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, సీఎంఓ ప్రత్యేకాధికారి డాక్టర్ హరికృష్ణ, ట్రస్టు సభ్యులు ఆర్జె.రత్నాకర్ సీతారాముల పల్లకీని మోసి రథోత్సవంలో పాల్గొన్నారు. దేశ, విదేశాల నుంచి వందలాది మంది భక్తులు రథోత్సవానికి తరలివచ్చారు. ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్‌లో సత్యసాయి వ్రతాన్ని వేద పండితులు కనుల పండువగా నిర్వహించారు.













