18 నుంచి సత్యసాయి జయంతి వేడుకలు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఈ నెల 18 నుంచి సత్యసాయి బాబా 95వ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు సత్యసాయి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. 18న ఉదయం వేణుగోపాలస్వామి రథోత్సవంతో వేడుకలు ప్రారంభవుతాయన్నారు. 19న అంతర్జాతీయ మహిళా దినోత్సవం వర్చువల్ విధానంలో ఉంటుందన్నారు. 22న సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 39వ స్నాతకోత్సవం నిర్వహిస్తామన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేస్తామన్నారు. 23న ఉదయం 8 గంటలకు సత్యసాయి 95వ జయంతి వేడుకలు ప్రశాంతి నిలయంలో నిర్వహిస్తామన్నారు. భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడానికి అనుమతిస్తామన్నారు.













