ఘనంగా సత్యసాయి జయంతి వేడుకలు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి సత్యసాయిబాబా నామస్మరణతో మార్మోగింది. సాయికుల్వంత్ మందిరంలో సత్యసాయి 95వ జయంతి వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. 2019-20 సత్యసాయి ట్రస్టు వార్షిక నివేదికను ట్రస్టు వర్గాలు విడుదల చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సత్యసాయి సేవా సంస్థలను, సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్లోకి చేర్చి, సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ట్రస్టు సభ్యులు నాగానంద పేర్కొన్నారు. సత్యసాయి అమృతవాణి కన్నడ యూట్యూబ్ ఛానల్లో ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ ప్రారంభించారు. సాయంత్రం 5 గంటలకు ప్రశాంతి నిలయంలో స్వర్ణరథంపై సత్యసాయి చిత్రపటాన్ని ఉంచి ఊరేగించగా మందిరంలో సాయి కీర్తనలు ఆలపిస్తూ జోలసేవ ఘనంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు మహాసమాధిని దర్శించుకున్నారు.













