సచివాలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
అమరావతి సచివాలయం లో సంక్రాంతి సంబరాలు ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొని ఉద్యోగులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత పురోగతిని సాధిస్తుందని వారు ఆకాంక్షను వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ వాతావరణాన్ని తలపించేలా జానపద కళలైన కర్రసాము, కత్తి సాములతో కళాకారులు, రంగవల్లులతో మహిళా ఉద్యోగినులు, హరిదాసు గంగిరెద్దులు, సన్నాయి, మేళతాళాల మధ్య ఎడ్ల బండిలో మంత్రులకు ఉద్యోగులు స్వాగతం పలికి సత్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలతో పాటు ఆటలు, పాటల పోటీలను నిర్వహించారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె. సునీత, కమిషనర్ ఎం.ఎం. నాయక్, ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.













