12 నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం మహా క్షేత్రంలో ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు 13వ తేదీన స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు నిర్వహిస్తారు. 15న మకర సంక్రాంతి రోజున బ్రహ్మోత్సవ కల్యాణం జరిపిస్తారు. 18న అశ్వవాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత, ప్రత్యక్ష, పరోక్ష సేవలైన రుద్రహోమం, చండీహోమం, మృత్యుంజయ హోమం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కల్యాణం, స్వామి అమ్మవార్ల కల్యాణం, ఏకాంత సేవలను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.













