ఏపీ సీఎస్ పదవీకాలం.. మరో ఆరు నెలలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా డాక్టర్ సమీర్ శర్మ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పాటు పొడిగించింది. సమీర్ పదవీకాలం పొడిగించాలని ఈ నెల 2న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీఎస్‌గా సమీర్ శర్మ పదవీకాలాన్ని వచ్చే ఏడాది మే 31 వరకూ పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ వ్యవహరాలశాఖ (డిఒపిటి) కార్యదర్శి కుల్దీప్ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. 1985వ సంవత్సరం ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సమీర్ శర్మ ఈ నెల 1న సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆయన ఈ నెల 30న పదవీ విరమణ చేయూల్సి ఉండేది.













