ప్రొటెం స్పీకర్ గా అప్పలనాయుడు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన వెంకట అప్పలనాయుడు ప్రమాణం చేశారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అప్పలనాయుడుతో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు. ప్రొటెం స్పీకర్‌గా నియమితులైయిన శంబంగి శాసనసభ సమావేశాల తొలి రోజున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్మేలతో పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తరువాత శాసనసభ స్పీకర్ ఎన్నికను కూడా నిర్వహించాల్సి ఉంటుంది. కొత్తగా ఎన్నికైన స్పీకర్‌కు పదవీ బాధ్యతలు అప్పగించిన తరువాత ఆయన పదవీకాలం ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.













