తిరుమలలో ప్రారంభమైన సాలకట్ల బ్రహ్మోత్సవాలు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. మలయప్ప స్వామి వారి సమక్షంలో గరుడ ధ్వజాన్ని ఎగరవేశారు. వేదపండితుల మంత్రాల మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు నిర్వహించే పెద్దశేష వాహన సేవలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. మరోవైపు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. చిన్నారులు తప్పిపోకుండా ఉండేందుకు జియో ట్యాగులు వేశారు. బ్రహ్మోత్సవాల సమయంలో సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. స్వయంగా ప్రొటోకాల్ ప్రముఖులనే అనుమతించనున్నారు. చంటిపిల్లల తల్లిదండ్రులకు ఇచ్చే ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు.













