ముందస్తు ఎన్నికలపై సజ్జల క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ముందస్తున్న ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదు అని క్లియర్ కట్‌గా చెప్పారు. ముందస్తు ఎన్నికల పేరుతో కొన్ని మీడియా ఛానెళ్లు హడావుడి చేస్తున్నాయని అన్నారు. జగన్న సురక్ష కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటాం. మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతీ ఎమ్మెల్యేకు ప్రజలు ఇదే చెబుతున్నారు. సీఎం జగన్ పూర్తిగా పాజిటివ్ ఓటునే నమ్ముకున్నారు. ముందస్తు ఎన్నికలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలకు కొమ్మకాసే మీడియా ఛానెల్స్ హడావుడి ఇది. ప్రజలను గందరగోళానికి గురిచేయవద్దు అని అన్నారు.













