కరోనా కట్టడిలో ఏపీ ముందు వరుసలో ఉంది : సజ్జల
కరోనా కట్టడి చర్యల్లో భాగంగానే కర్ఫ్యూను అమలు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో కరోనా కట్టడికి తాము ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని తెలిపారు. ఈ సమయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, కరోనాపై పోరులో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ ముందంజలో ఉందని ప్రకటించారు. రోజుకు 6 లక్షల మందికి టీకా ఇచ్చే వ్యవస్థ రాష్ట్రంలో ఉందని, టీకా డోసులు కావాలని ఎప్పటికప్పుడు కేంద్రానికి లేఖలు రాస్తూనే ఉన్నామని వెల్లడించారు. ప్రజారోగ్యం కోసం కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలోకి తెచ్చామని, అవసరమైన ఆక్సిజన్, రెమిడేసివిర్లను అందుబాటులో ఉంచామని సజ్జల పేర్కొన్నారు.













