అభివృద్ధి కోసమే మూడు రాజధానులు
ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి కోసమే మూడు రాజధానులని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి వికేంద్రీకరణకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు టీడీపీ అన్యాయం చేస్తోందన్నారు. మూడు రాజధానుల నిర్ణయం సామాజిక న్యాయానికి అనుగుణంగా ఉందన్నారు. గతంలో హైకోర్టు తీర్పు సామాజిక న్యాయానికి భిన్నంగా ఉందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. డిసెంబర్ 5న వికేంద్రీకరణ, న్యాయ రాజధాని గొంతు బలంగా వినిపించాలని వెల్లడించారు.













