సీఎం ఎలా ఉండాలో జగన్ చూపించారు: సజ్జల
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగులు లేకుండా ప్రభుత్వాలు ఏమీ చేయలేవని, అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని సమస్యలు వచ్చాయని ఆయన చెప్పారు. అయితే ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా సరైన మార్గంలోనే ఖర్చు చేస్తోందని స్పష్టం చేశారు. గతంలో ఉద్యోగ సంఘాలను కూడా కొందరు రాజకీయాల కోసం వాడుకునే వారంటూ పరోక్షంగా టీడీపీపై విమర్శలు చేశారు. కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం ఉద్యోగులను వేరుగా చూడటం లేదని, వాళ్లను కూడా ప్రభుత్వంలో భాగంగానే పరిగణిస్తున్నారని వెల్లడించారు.తన మూడున్నరేళ్ల పాలనలో సీఎం జగన్ అందరికీ రోల్ మోడల్‌గా నిలిచారని, సీఎం ఎలా ఉండాలో చూపించారని పేర్కొన్నారు.మీడియా తమ చేతుల్లో ఉంది కదా అనే ధీమాతో టీడీపీ అబద్ధాలను ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.













