ముందస్తు ఎన్నికలపై సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ
టీడీపీ, జనసేనలు ఎప్పుడూ కలిసే ఉన్నాయని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్రమ సంబందానికి పవిత్రతను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 11 మంది చనిపోతే పవన్ కనీసం పరామర్శించలేదు. మరణాలకు కారణమైన చంద్రబాబును పరామర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు మంచి పాలన ఇవ్వలేదు, కాబట్టే ప్రజలు ఓడించారు. ఎంతమంది కలిసి వచ్చినా మా ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది వైఎస్ జగన్ ప్రభుత్వమే అని అన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న పార్టీలే ముందస్తు ఎన్నికలు కోరుకుంటున్నాయి. బలమైన జగన్‌ను ఎదుర్కొనేందుకు వీళ్లంతా ఏకమవుతున్నారు. బీజేపీ కూడా వారితో కలిస్తే సీపీఐ రామకృష్ణ ఏం చెప్పారు. ఎరుపు, కాసాయం కలిస్తే పసుపు అవుతుందేమో చూడాలి. పందికొక్కులు, గుంటనక్కలు, ఏకం కావడాన్ని జనం చూస్తున్నారు. జగన్‌కు ఉన్న ప్రజాబలం ముందు ఎవరూ నిలవలేరు అని అన్నారు.













