ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇది అన్ని రాజకీయ పార్టీలకు
రాష్ట్ర ప్రజల భద్రత కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో నిబంధనలకు లోబడే సభలు జరుపుకోవాలని తెలిపారు. షరతులు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం, ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని ఆదేశాలు ఇచ్చాము. రోడ్లపై కాకుండా గ్రౌండ్లో సభలు జరుపుకోవచ్చు. కేవలం ప్రతిపక్షాలపై పరిమితులు విధించలేదు. ఇది అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది. వైఎస్ఆర్సీపీ కూడా నిబందనలు పాటించాల్సిం ఉంటుంది. కందుకూరు, గుంటూరులో ఏం జరిగిందో చూశాం. చంద్రబాబు అమాయకుల ప్రాణాలు తీశారు అని మండిపడ్డారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఇకపై జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులపైన మార్జినల్లో సభలు, ర్యాలీలకు అనుమతించేది లేదని స్పష్టంచేసింది.













