వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్దులు ఖరారు
స్థానిక సంస్థల కోటా నుంచి 9, ఎమ్మెల్యే కోటా నుంచి 7, గవర్నర్ కోటాలో రెండు సీట్లు కలిపి మొత్తం 18 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించారు. సామాజిక న్యాయానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేసారు. ఇందులో బీసీలకు 11 సీట్లు, అలాగే ఓసీలకు 4, ఎస్సీలకు 2, ఎస్టీలకు ఒక సీట్లను కేటాయిస్తూ ముఖ్యమంత్రి జగన్ డిసైడ్ అయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సామాజిక న్యాయానికి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉంది. ఓట్ల కోసం నినాదాలు ఇచ్చే పార్టీ మాది కాదు. వారిని అధికారంలో భాగస్వామ్యం చేశాం. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనది అంటూ కామెంట్స్ చేశారు.













