చంద్రబాబుకి జగన్ కి ఉన్న తేడా అదే
ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలుపుకుంటూ నియంతృత్వానికి చెక్ పెట్టాలనే టాస్క్‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు సక్సెస్‌పుల్‌గా పూర్తి చేశారని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని విమర్శించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఒక శిల్పి అని అభివృద్ది అనే శిల్పాన్ని నిరంతరాయంగా చెక్కుతూనే ఉంటారని పేర్కొన్నారు. ఏపీలో కూడా ఆయన చేసిన అభివృద్ధికి ఎన్నో ఉదాహరణలున్నాయన్నారు. వైసీపీ అధినేత జగన్‌కు ఎప్పుడు ఏం చేయాలో తెలియదని ఎద్దేవా చేశారు. 2014లో ప్రజలు ఆయనను ప్రధాన ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన తరువాత అప్పుడు మూట ముల్లె సర్దుకుని వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండాలనీ.. కానీ ఐదేళ్లు రాష్ట్రానికి రాలేదన్నారు. ఇప్పుడు ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదని తెలిసిన తర్వాత ఇప్పుడు అమరావతికి మార్చుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబుకీ, జగన్‌కి ఉన్న తేడా అదేనని యామిని పేర్కొన్నారు.













