మే 23న తర్వాత విదేశాలకు విజయసాయిరెడ్డి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై తెలుగుదేశం పార్టీ మహిళ నేత సాధినేని యామిని మండిపడ్డారు. గాలికి సచివాలయంలో టెంట్ పడితే నానా యాగీ చేస్తున్న విజయసాయిరెడ్డికి హుద్ హుద్ తుఫాన్ కనిపించలేదా? అని అడిగారు. ఉపాధి హామీ పథకం అమలు చూసి కేంద్రం ఏపీకి అవార్డులు ఇచ్చిందన్నారు. కానీ నిధులు రాకుండా వైసీపీ ఆపాలని చూసిందని ఆరోపించారు. టీడీపీపై విషయం చిమ్మడమే విజయసాయిరెడ్డి ధ్వేయమని విమర్శించారు. విజయసాయిరెడ్డి పేరు వీసా రెడ్డిగా మార్చుకున్నారన్నారు. మే 23 తర్వాత విజయసాయిరెడ్డి విదేశాలకు పారిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.













