సీఎం చంద్రబాబును కలిసిన సచిన్ టెండుల్కర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ సింగపూర్లో కలిశారు. ప్రస్తుతం సింగపూర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. అయితే అదే సమయంలో సింగపూర్లో ఉన్న సచిన్ టెండుల్కర్ చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఆయా అంశాలపై చర్చ జరిగింది. కాగా ఏపీలోని నెల్లూరు జిల్లాలో సచిన్ ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇప్పటికే ఈ గ్రామంలో ఆయా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఈ గ్రామం అభివృద్ధిపై సచిన్, చంద్రబాబుల మధ్య కాసేపు చర్చ జరిగింది.













