మాజీ ఎంపీ సబ్బం హరికి సీరియస్….ఐసీయూలో
ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సబ్బం హరి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో విశాఖపట్నం కలెక్టరేట్ జంక్షన్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 15న ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, మూడు రోజుల పాటు హోం ఐసొలేషన్‌లో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులు ఆందోళనగా ఉన్నారు.
సబ్బం హరి ఆరోగ్య పరిస్థితిపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వాకబు చేశారు. ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రి వైద్యులకు ఫోన్ చేసి మాట్లాడారు. సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాల గురించి తెలుసుకున్నారు. ఆయన కటుంబ సభ్యులతోనూ ఫోన్లో మాట్లాడారు. సబ్బం హరి త్వరగా కోలుకోవాలని చంద్రబాబూ ఆకాంక్షించారు.













