Saap Chairman:2029 నేషనల్ గేమ్స్‌కు మన రాష్ట్రం ఆతిథ్యం:రవినాయుడు
గత ఐదేళ్లు వైసీపీ (YCP) హయాంలో క్రీడలను విస్మరించారని, ఆడుదాం ఆంధ్రా పేరుతో రూ.125 కోట్లు దోచేశారని శాప్ చైర్మన్ రవినాయుడు (Ravinaidu) ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ నిధులు ఒక జిల్లాకు ఇస్తే చక్కటి మౌలిక సదుపాయాలు వచ్చేవన్నారు. విశాఖలో వీఎంఆర్డీఏ (VMRDA ) తో కలిసి క్రీడా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కరణం మల్లీశ్వరి (Karanam Malleswari ) సహకారంతో విశాఖలో వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ (Weightlifting Academy) ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలిపారు. 2029 నేషనల్ గేమ్స్‌కు మన రాష్ట్రం అతిథ్యం ఇచ్చేలా బిడ్ వేస్తున్నామని తెలిపారు. 2027లో పారా అథ్లెట్ పోటీలకు విశాఖ ఆతిథ్యమిచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. క్రీడలకు 3 వాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రో కబడ్డీని ప్రోత్సహిస్తున్నామన్నారు.







