Legislative Council: శాసనమండలిలో కాఫీపై వివాదం

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో కాఫీ (Coffee) పై వివాదం చోటు చేసుకుంది. మండలిలో ఇచ్చే కాఫీకి, శాసనసభ (Legislative Assembly) లో ఇచ్చే కాఫీకి తేడా ఉంటోందని మండలి చైర్మన్ మోషేన్‌రాజు (Moshen Raju) అన్నారు. రెండు చోట్ల ఒకే రకమైన కాఫీ, భోజనాలు లేవంటూ వైసీపీ (YCP) సభ్యులు ఆందోళన చేశారు. అలాంటి తేడా ఎక్కడా లేదని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) వివరణ ఇచ్చారు. ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగితే పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. చర్చకు పట్టుబట్టిన వైసీపీ సభ్యులు సభను స్తంభింపచేశారు. దీంతో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.