Rayavaram: వారికి 15 లక్షల పరిహారం : సీఎం చంద్రబాబు

ఇటీవల కోనసమీ జిల్లా రాయవరం (Rayavaram) లో చాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. చంద్రబాబుతో హోం మంత్రి అనిత (Anita), అధికారులు సురేశ్, రవికృష్ణ భేటీ అయ్యారు. కోనసీమ జిల్లాల్లో బాణాసంచా పేలుడుపై నివేదికను సీఎంకు అందించారు. ఒకే షెడ్డూల్ 14 మంది కార్మికులు మెటీరియల్ తయారు చేసినట్లు నివేదించారు. హార్డ్ మెటీరియల్ కావడం వల్లే పేలుడు జరిగినట్లు వివరించారు. నిబంధనలు ఏమాత్రం పాటించలేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. లైసెన్స్ ఇచ్చే ముందు నిబంధనలకు అనుగుణంగా తనిఖీలు చేయాలని అన్నారు. బాణసంచా తయారీ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు (CCTV cameras) ఏర్పాటు చేయాలన్నారు. ఎక్స్‌ప్లోజివ్ మెటీరియల్ ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు జరిగేలా చూడాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పీడ్ యాక్ట్ కింద కేసులు పెట్టాలన్నారు. బాణాసంచా కేంద్రాల్లో పని చేసేవారికి బీమా ఉండాలని స్పష్టం చేశారు.