టీటీడీకి ఆర్‌ఎస్ బ్రదర్స్ రూ.3.70 కోట్ల విరాళం

హైదరాబాద్‌కు చెందిన వ్యాపార సంస్థ ఆర్‌ఎస్ బ్రదర్స్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లోని వివిధ ట్రస్టులకు రూ.3.70 కోట్ల భారీ విరాళాన్ని అందించింది. స్థం ఎండీలు పొట్టి వెంకటేశ్వర్లు, రాజమౌళి, ప్రసాదరావు, మాలతి లక్ష్మీ కుమారిలు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం చెక్కు అందజేశారు. టీటీడీ ట్రస్టుల ద్వారా హిందూ ధర్మ పరిరక్షణ, విద్య, వైద్యానికి చేస్తున్న సేవలకు చేయూతగా విరాళాన్ని అందించినట్లు దాతలు వెల్లడిరచారు.