ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం
కులమతాలకు అతీతంగా నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. నగరంలోని స్వర్ణాల చెరువులో ప్రారంభమైన ఈ పండుగకు దేశం నలుమూలల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. తొలిరోజు సుమారు రెండు లక్షల మంది భక్తులు వచ్చినట్టు అధికారులు అంచనావేసారు. తొలి రోజున వివాహం, ఉద్యోగం రెట్టెలకు డిమాండ్ ఏర్పడింది. ఆ రొట్టెల కోసం యువత ఎక్కువసేపు ఘాట్ల వద్ద వేచి చూశారు. కాగా, సీఎం చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రొట్టె మార్చారు. నెల్లూరు మేయర్‌కు ఆ రొట్టెను అందించారు. ఈ దఫా ప్రత్యేకంగా దర్గాలో బారాషాహీద్లు పేరున పన్నెండు రొట్టెలను చదివింపులు చేశారు. వాటిని స్వర్ణాల చెరువులో నిమజ్జనం చేశారు. మంత్రి నారాయణ, మేయర్ అజీబ్, ఉత్సమ కమిటీ సభ్యులు భక్తులకు రొట్టెల పండుగ ప్రసాదాలను అందించారు. బారాషాహీద్లోని సమాధులను మత పెద్దలు సందన్మాల్ చేసి గలీఫ్లు కప్పారు. నేడు గంధ మహోత్సవం జరగనుంది.













