జస్టిస్ ఎన్వీ రమణకు జీవిత సాఫల్య పురస్కారం
ఈ ఏడాది రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ జీవిత సాఫల్య పురస్కారానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణను ఎంపిక చేసినట్లు ఆహ్వాన సంఘం కన్వీనర్ డాక్టర్ కె. పట్టాభి రామయ్య తెలిపారు. ఈ నెల 25వ తేదీన సిద్ధార్థ అకాడమీ ప్రాంగణంలో పురస్కార ప్రదానం జరుగుతుందని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి జీవిత సాఫల్య పురస్కారం అందచేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, రోటరీ ఇంటర్నేషనల్ జిల్లా 3020 గవర్నర్ ఎం.రామారావు విశిష్ట అతిథులుగా పాల్గొంటారన్నారు. డాక్టర్ ఎంసీ దాస్, రోటరీ క్లప్ ఆఫ్ విజయవాడ అధ్యక్షుడు కె.ఎన్.ఎస్.ఆర్. ప్రసాద్, కార్యదర్శి వి.సుబ్బరావు నాయుడు తదితరులు పాల్గొన్నారు.













